అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా ఈవెంట్‌లో భాగంగా, లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. ఇపుడు సూపర్-8 మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. గ్రూప్ ఏ నుంచి భారత్, అమెరికా, గ్రూపు బీ నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గ్రూపు సీ నుంచి ఆప్ఘనిస్థాన్, వెస్టిండీస్, గ్రూపు డి నుంచి సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు అర్హత సాధించాయి. ఈ 8 జట్లు ముందుగా నిర్ణయించిన సిడింగ్ మేరకు రెండు గ్రూపులుగా విభజించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు ఈ సూపర్-8 మ్యాచ్‌లు జరుగనున్నాయి.
గ్రూపు-1లో భారత్, ఆస్ట్రేలియా, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌లు ఉండగా, గ్రూపు-2 నుంచి సౌతాఫ్రికా, వెస్టిండీస్, అమెరికా, ఇంగ్లండ్‌లు ఉన్నాయి. ఇకపోతే, సూపర్-8లో భారత క్రికెట్ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నెల 20న బార్బడోస్‌లో ఆప్ఘనిస్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత 22వ తేదీన ఆంటిగ్వాలో బంగ్లాదేశ్‌తో, జూన్ 24వ తేదీన సెయింట్ లూసియాలో ఆస్ట్రేలియా జట్టుతో తలపడుతుంది. రోహిత్ శర్మ సేన ఆడే మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతాయి.
ఇకపోతే సూపర్-8 పూర్తి షెడ్యూల్‌ను పరిశీలిస్తే,
జూన్ 19 : అమెరికా వర్సెస్ దక్షిణాఫ్రికా (ఆంటిగ్వా- రాత్రి 8 గంటలకు)
జూన్ 20 : ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ (లూసియా- ఉదయం 6 గంటలకు)
జూన్ 20 : భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ (బార్బడోస్- రాత్రి 8 గంటలకు)
జూన్ 21 : ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (బార్బడోస్- ఉదయం 6 గంటలకు)
జూన్ 21 : ఇంగ్లండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా (లూసియా- రాత్రి 8 గంటలకు)
జూన్ 22 : అమెరికా వర్సెస్ వెస్టిండీస్ (బార్బడోస్- ఉదయం 6 గంటలకు)
జూన్ 22 : భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా- రాత్రి 8 గంటలకు)
జూన్ 23 : ఆఫ్ఘనిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (విన్సెంట్- ఉదయం 6 గంటలకు)
జూన్ 23: అమెరికా వర్సెస్ ఇంగ్లండ్ (బార్బడోస్- రాత్రి 8 గంటలకు)
జూన్ 24 : వెస్టిండీస్ వర్సెస్ దక్షిణాఫ్రికా (ఆంటిగ్వా- రాత్రి 6 గంటలకు)
జూన్ 24 : భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (లూసియా- రాత్రి 8 గంటలకు)
జూన్ 25 : ఆఫ్ఘనిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (విన్సెంట్- ఉదయం 6 గంటలకు)