గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 10 జులై 2024 (19:44 IST)

టీ20 సిరీస్ : జింబాబ్వే ముంగిట 183 రన్స్ టార్గెట్!!

indis vs zimbabwe
భారత్, జింబాబ్వే జట్ల మధ్య టీ20 సిరీస్ జరుగుతుంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్‌లలో ఇరు జట్లూ తలా ఒక్కో మ్యాచ్‌లో గెలుపొందాయి. కీలకమైన మూడో వన్డే మ్యాచ్ బుధవార ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్... బ్యాటింగ్ ఎంచుకుంది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. భారత జట్టు కెప్టెన్ శుభమన్ గిల్ అరథ్థ సెంచరీతో రాణించాడు. టాపార్డర్‌లో ఒక్క అభిషేక్ శర్మ తప్ప మిగిలిన అందరూ దూకుడుగా ఆడారు. అభిషేక్ వర్మ మాత్రమే కేవలం 10 పరుగులు చేసి ఔట్ కాగా, గిల్ 66 పరుగులు చేశాడు. 
 
అంతకుముందు భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్, గిల్‌‍లు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. కేవలం 8.1 ఓవర్లలో 67 పరుగులు జోడించారు. ఈ క్రమంలో జైస్వాల్ 27 బంతుల్లో నాలుగు ఫోర్లు, 2 సిక్సర్లతో 36 పరుగులు చేయగా, గిల్ 49 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ 28 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స్‌లతో 49 పరుగులు చేశాడు. మ్యాచ్ ఆఖరులో సంజూ శాంసన్ 12, రింకూ సింగ్ ఒక్క పరుగుతో నాటౌట్‌గా నిలిచాడు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబాని 2, కెప్టెన్ సికిందర్ రాజా 2 చొప్పున వికెట్లు తీశారు.