బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 12 డిశెంబరు 2017 (09:14 IST)

జీవితంలో ఎప్పటికీ కలిసుండాలని ప్రమాణం చేసుకున్నాం- కోహ్లీ అనుష్క పెళ్లి వీడియో

జీవితంలో ఎప్పటికీ కలిసుండాలని ఒకరికి ఒకరం ప్రమాణం చేసుకున్నామని.. ట్విట్టర్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. బాలీవుడ్ సుందరి అనుష్క శర్మను డిసెంబర్ 12న (నేడు) వివాహమాడిన సందర్భంగా త

జీవితంలో ఎప్పటికీ కలిసుండాలని ఒకరికి ఒకరం ప్రమాణం చేసుకున్నామని.. ట్విట్టర్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. బాలీవుడ్ సుందరి అనుష్క శర్మను డిసెంబర్ 12న (నేడు) వివాహమాడిన సందర్భంగా తొలి ట్వీట్ చేసిన కోహ్లీ.. ఈ రోజు తమకెంతో ప్రత్యేకమన్నాడు. 
 
ఒకరికి ఒకరం జీవితాంతం కలిసివుండాలని.. జీవితంలో ఎప్పటికీ ప్రేమానుబంధం మధ్య కలిసివుంటామని  ప్రమాణం చేసుకున్నామని కోహ్లీ చెప్పాడు. ఈ వార్తను మీ అందరితో పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా వుందని తెలిపాడు. 
 
తమ కుటుంబ సభ్యులు, అభిమానులు, బంధుమిత్రుల మద్దతుతో ప్రేమ, ఆశీస్సుల ద్వారా ఈరోజు తమకు ప్రత్యేకంగా మారిపోయిందని కోహ్లీ హర్షం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా తమ ప్రయాణంలో పాలుపంచుకున్న అందరికీ ట్విట్టర్లో కోహ్లీ కృతజ్ఞతలు తెలిపాడు. కాగా విరాట్ కోహ్లీ, అనుష్క వివాహ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకా పెళ్లి వీడియోను ఓ లుక్కేయండి.