మళ్లీ విరాట్ కోహ్లీనే టాప్ : ఎందులో?

virat kohli
Last Updated: గురువారం, 20 డిశెంబరు 2018 (15:54 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రకటించిన ర్యాంకుల పట్టికలో కోహ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇప్పటికే టాప్ ర్యాంక్‌లో ఉన్న విరాట్.. తాజాగా 14 పాయింట్లు సాధించి మొత్తం 934 పాయింట్ల‌తో ర్యాంకింగ్స్‌లో మొద‌టి స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జ‌రిగిన రెండో టెస్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో విరాట్ విరోచిత సెంచ‌రీ చేసిన విష‌యం తెలిసిందే.

ఆ ఇన్నింగ్స్‌లో అత‌ను 123 ర‌న్స్ చేశాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్‌.. బ్యాటింగ్ ర్యాంకుల్లో రెండ‌వ స్థానంలో నిలిచాడు. కోహ్లీ, విలియ‌మ్స‌న్ మ‌ధ్య 19 పాయింట్ల తేడా ఉంది. ఇత‌ర ప్లేయ‌ర్లు టామ్ లాథ‌మ్‌, ఏంజిలో మాథ్యూస్‌, నాథ‌న్ లియాన్‌లు కూడా త‌మ ర్యాంక్‌ను మెరుగుప‌రుచుకున్నారు. భార‌త బౌల‌ర్ల‌లో ష‌మీ, బుమ్రాలు త‌మ ర్యాంక్‌ను మెరుగుప‌రుచుకున్నారు.దీనిపై మరింత చదవండి :