బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2022 (19:27 IST)

ఆసియా కప్‌ ప్రధాన కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

VVS Laxman
యూఏఈలో ఈ నెల 27 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ కెప్టెన్‌గా, కే.ఎల్.రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ టోర్నమెంట్‌కు మొత్తం 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ఎంపిక చేసింది. ఇక ఆసియా కప్ కోసం భారత మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. 
 
ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీకి ప్రధాన కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ ఇటీవల కోవిడ్ బారిన పడిన నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్ పూర్తయ్యే వరకు హెడ్ కోచ్‌గా లక్ష్మణ్ వ్యవహరిస్తారని బీసీసీఐ ప్రకటించింది.