శనివారం, 16 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 22 జులై 2017 (13:33 IST)

మహిళా క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత టీమ్.. డ్యాన్స్ చేస్తూ సిగ్గుపడిన మిథాలీ

మహిళా క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్‌తో పోటీ పడనుంది. ఫైనల్ పోరుకు చేరుకున్న సందర్భంగా మిథాలీ టీమ్ ఖుషీ ఖుషీగా వుంది. ఈ సందర్భంగా భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ డ్యాన్స్ చేస్తూ

మహిళా క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్‌తో పోటీ పడనుంది. ఫైనల్ పోరుకు చేరుకున్న సందర్భంగా మిథాలీ టీమ్ ఖుషీ ఖుషీగా వుంది. ఈ సందర్భంగా భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ డ్యాన్స్ చేస్తూ సిగ్గుపడిపోయిన ఘటన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో చోటుచేసుకుంది. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడిన భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 35 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. 
 
ఈ సమయానికి హర్మన్ ప్రీత్ కౌర్ అడపాదడపా షాట్లు కొడుతూ సెంచరీ పూర్తి చేసింది. ఆ ఆనందంలో అప్పటికే అవుటైపోయిన మిథాలీ రాజ్ తన సహ క్రీడాకారిణితో కలిసి బౌండరీ లైన్ బయట కూర్చుని రెండు స్టెప్పులేసింది. ఆ సమయంలో కెమెరా వారిని గమనించడం మిథాలీ రాజ్ గమనించలేదు. అలా రెండు స్టెప్పులేస్తూ స్క్రీన్ చూసి మిథాలీ సిగ్గుపడిపోయింది. ఆ వీడియోను ఐసీసీ తన అఫీషియల్ పేజ్‌లో పోస్టు చేసింది. 
 
ఇదిలా ఉంటే.. మహిళా ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌తో టీమిండియా పోటీ పడనుంది. ఈ నేప‌థ్యంలో కెప్టెన్‌ మిథాలీ రాజ్ తండ్రి దొరై రాజ్ ఇండియ‌న్ టీమ్‌కు గుడ్‌విషెస్ చెప్పారు. దేశ‌వ్యాప్తంగా మిథాలీ సేన‌కు విషెస్ రావ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. ఇండియా ఫైన‌ల్‌కు వెళ్ల‌డం గొప్ప అవ‌కాశ‌మ‌ని, దేశానికి వ‌ర‌ల్డ్‌క‌ప్ తీసుకురావ‌డం మిథాలీ స్వ‌ప్న‌మ‌ని దొరైరాజ్ అన్నారు. మిథాలీ క‌ప్ గెల్చుకొస్తుందని దొరైరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు.