16 బంతులు, 74 పరుగులు.. టీ10లో మొహ్మద్ షాజాద్ సరికొత్త రికార్డు

Last Updated: గురువారం, 22 నవంబరు 2018 (15:44 IST)
లీగ్ పోటీల్లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్‌ స్టార్ ప్లేయర్ మొహ్మద్ షాజాద్ సరికొత్త రికార్డును సృష్టించాడు. టీ-20 క్రికెట్ చరిత్రలో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 16 డెలివరీలలో 74 పరుగులు సాధించాడు. ఇందులో ఎనిమిది సిక్సులు, ఆరు బౌండరీలు వున్నాయి. 
 
ఇంకా అతివేగంతో పది ఓవర్ల ఫార్మాట్‌లో అర్థ సెంచరీని నమోదు చేసుకున్న ఆటగాడి మొహ్మద్ షాజాద్ నిలిచాడు. తద్వారా సింధీస్‌పై ఆరు ఓవర్ల తేడాతో జట్టుకు విజయాన్ని సంపాదించి పెట్టడంతో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. 
 
సింధీస్ బౌలింగ్‌‌ను ధీటుగా ఎదుర్కొన్నాడు. సింధీస్ నిర్ణయించిన 94/6 లక్ష్యాన్నిఆఫ్గన్ అందుకుంది. ఈ లక్ష్యాన్ని ఆఫ్ఘాన్ సునాయాసంగా చేధించింది. లక్ష్య సాధనలో మొహ్మద్ షాజాద్ పరుగులు జట్టుకు సులభంగా విజయాన్ని సంపాదించి పెట్టాయి. దీనిపై మరింత చదవండి :