సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 అక్టోబరు 2023 (22:26 IST)

ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్.. హైలైట్స్.. సోషల్ మీడియాలో వైరల్

Pak_Aus
Pak_Aus
బెంగుళూరులో జరుగుతున్న ప్రపంచకప్ మ్యాచ్‌లో 368 పరుగుల ఛేదనలో పాకిస్థాన్ ఎనిమిది వికెట్లు కోల్పోవడంతో ఆస్ట్రేలియా ఆటపై ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆడమ్ జంపా 53 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీయగా, మార్కస్ స్టోయినిస్ రెండు వికెట్లు తీశాడు. 
 
అంతకుముందు పాట్ కమిన్స్ ఒక వికెట్ తీశాడు. డేవిడ్ వార్నర్ 163 పరుగుల ఎదురుదాడితో చెలరేగగా, మిచెల్ మార్ష్ అద్భుతమైన 121 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. కాగా, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ తర్వాత షాహీన్ అఫ్రిది ఐదు వికెట్లు పడగొట్టాడు.
 
చిన్నస్వామి స్టేడియంలో 50 ఓవర్లలో 367/9 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇన్నింగ్స్‌లో పాక్ పేసర్ షాహీన్ షా అఫ్రిది పాక్ బౌలింగ్ దాడిలో ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 
 
ప్రపంచకప్ చరిత్రలో ఒకటి కంటే ఎక్కువ 5 వికెట్లు తీసిన పేసర్‌గా షాహీన్ షా అఫ్రిది కొత్త పాకిస్తాన్ రికార్డును సృష్టించాడు.
 
 ఇకపోతే, వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్‌కు హాజరైన ఓ పాకిస్థాన్ అభిమాని పట్ల మ్యాచ్ భద్రత కోసం వచ్చిన ఓ పోలీస్ అధికారి అనుచితంగా ప్రవర్తించాడు. 
 
ఇండియన్ ఫ్యాన్స్‌తో నిండిపోయిన ఈ మైదానంలో 'పాకిస్థాన్ జిందాబాద్'అంటూ నినాదాలు చేసిన సదరు పాక్ అభిమానిని పోలీస్ అధికారి అడ్డుకున్నాడు. 
 
పోలీస్ అధికారి అనుచిత ప్రవర్తనతో ఖంగుతిన్న సదరు అభిమాని గట్టిగా నిలదీసాడు. సదరు అభిమాని గట్టిగా మాట్లాడటంతో అక్కడికి వచ్చిన మ్యాచ్ నిర్వాహకులు అతనికి క్షమాపణలు చెప్పి సదరు పోలీస్ అధికారిని అక్కడి నుంచి పంపించేసారు.