సోమవారం, 27 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 జూన్ 2020 (11:35 IST)

పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్‌కు సానియా వార్నింగ్.. ఎందుకో తెలుసా?

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్‌కు వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ టీ20, వన్డే జట్టు కెప్టెన్ టీ20 వరల్డ్ నంబర్ వన్ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ ఆజమ్‌కు సానియా ఝలక్ ఇచ్చింది. 
 
సానియా భర్త పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో బాబర్ అజామ్ మాట్లాడుతుండగా.. కెప్టెన్ బాబర్ అజామ్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో షోయబ్ మాలిక్‌తో మాట్లాడాడు. మాలిక్ అడిగిన పలు ప్రశ్నలకి బాబర్ అజమ్ సమాధానాలు ఇస్తూ వచ్చాడు.
 
పాక్ క్రికెట్ జట్టులోని క్రికెటర్ల కుటుంబాలతో నీకు మంచి అనుబంధం ఉంది కదా...బాబర్ అని మాలిక్ అడిగాడు.. అవును అని కెప్టెన్ బాబర్ బదులిచ్చాడు. అయితే నీకిష్టమైన వదిన ఎవరు? అని బాబర్ ఆజమ్‌ను షోయబ్‌ మాలిక్ ప్రశ్నించాడు. 
 
బాబర్ ఏమాత్రం ఆలోచించకుండా.. మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ భార్య సైదా ఖుస్బత్ అని మాలిక్‌తో చెప్పాడు. సానియా మీర్జాతో బాబర్‌కి మంచి స్నేహం ఉంది. ఈ కారణంగా ఆమె పేరుని చెప్తాడని ఊహించిన మాలిక్‌కి ఒక్కసారిగా షాక్ తగిలింది. 
 
ఇక లైవ్‌ చూస్తున్న సానియా.. ఐ విల్‌ కిల్‌ యూ అని మెసేజ్‌ పెట్టారు. ఇక నుంచి షోయబ్‌ ఇంటిలోని వస్తే కూర్చోమని కూడా చెప్పను అని బాబర్‌పై సానియా చిరుకోపాన్ని ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అయింది.