సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : బుధవారం, 3 జులై 2019 (18:24 IST)

వన్డే ప్రపంచ కప్‌తో ఓవర్.. సచిన్ తరహాలో ధోనీ రిటైర్మెంట్?

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ మెగా టోర్నీతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టీమిండియాకు పలు ట్రోఫీలు సంపాదించి పెట్టిన మాజీ కెప్టెన్, వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ అయిన ధోనీపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
ధోనీ బ్యాటింగ్‌పై ఇప్పటికే మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌లు విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలను పక్కనబెట్టి ధోనీ తన పని తాను చేసుకుపోతున్నాడు. ఎన్ని విమర్శలు వస్తున్నా.. ధోనీ తన ఫ్యాన్స్ మద్దతుతో దూసుకుపోతున్నాడు.  
 
ధోనీపై విమర్శలే కాకుండా.. ఆతని రిటైర్మెంట్‌పై కూడా వార్తలు అప్పుడప్పుడూ వస్తూనే వున్నాయి. ప్రస్తుతం ఓ ఆంగ్ల మీడియా సంస్థ ధోనీ రిటైర్మెంట్‌పై వార్తను ప్రచురించింది. ఆ వార్తలో ధోనీ ప్రపంచ కప్‌తో వన్డేలకు స్వస్తి చెప్తాడని సదరు సంస్థ ప్రకటించింది. ధోనీకి వన్డే వరల్డ్ కప్ 2019తోనే సరిపెట్టుకుంటాడని తెలిపింది. 
 
కానీ రిటైర్మెంట్‌కు సంబంధించి ధోనీ నుంచి కానీ బీసీసీఐ నుంచి కానీ ఎలాంటి సమాచారం రాలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తరహాలో ధోనీ కూడా ప్రపంచ కప్ తర్వాత వన్డేలకు రాం రాం అంటారని.. తెలుస్తోంది.