ప్రపంచ కప్ టోర్నీ.. విజయశంకర్ అవుట్.. మయాంక్ ఇన్..
ప్రపంచకప్ టోర్నీలో ఆడే జట్టు నుంచి ప్రస్తుతం టీమిండియా క్రికెటర్లు వరుసగా ఇంటి బాటపడుతున్నారు. ఇందుకు గాయాలు కూడా కారణంగా నిలిచాయి. ఇప్పటికే డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయపడ్డాడు. వేలి గాయంతో మొత్తం టోర్నమెంట్ నుంచే వైదొలగిపోయాడు. ఆ తరువాతి వంతు భువనేశ్వర్ కుమార్‌ది.
కాలి కండరాల్లో గాయం వల్ల రెండు మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. తాజాగా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ కూడా ఈ మెగా ఈవెంట్ నుంచి తప్పుకున్నాడు. అలాగే విజయ్ శంకర్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకున్నారు.
భారత క్రికెట్ ప్రపంచంలో తాజా సంచలనంగా మారిన పేరు మయాంక్ అగర్వాల్. ఇంగ్లండ్‌లో ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఆడుతున్న భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్న క్రికెటర్. మడమల్లో గాయం కారణంగా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ టోర్నీ మొత్తానికీ దూరం కావడంతో.. అతని స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను తీసుకుంది.