బుమ్రా అంటే భయం.. 3 గంటలకే లేచి కూర్చుని ఆలోచించా? (video)

Last Updated: శనివారం, 13 జులై 2019 (18:53 IST)
భారత స్టార్ బౌలర్ బుమ్రా బౌలింగ్ గురించి న్యూజిలాండ్‌కు చెందిన రాస్ టేలర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ మైదానంలో భారత్‌తో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో బ్రిటీష్ జట్టు విజయాన్ని నమోదు చేసుకుంది. తద్వారా ప్రపంచ కప్ చరిత్రలో రెండో సారి ఫైనల్లోకి అడుగుపెట్టిన జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. 
 
ఈ మ్యాచ్‌లో గెలుపును నమోదు చేసుకునేందుకు రాస్ టేలర్ ఆటతీరే కీలకం. ఈ సందర్భంగా రాస్ టేలర్ ఓ ఇంటర్వ్యూలో టీమిండియా ఆటతీరుపై మాట్లాడాడు. విలియమ్సన్ అవుట్ అయిన తర్వాత జట్టు గెలుపుకు అనుగుణంగా బ్యాటింగ్ చేయాల్సిన బాధ్యత తనపై పడిందని రాస్ టేలర్ అన్నాడు. ఇంకా ఈ మ్యాచ్‌లో గెలవాలంటే.. భారత టాప్ ఆర్డర్‌ను దెబ్బ తీయాలనుకున్నాం.. అనుకున్నట్లే ఆ పని చేశాం. గెలిచామని రాస్ టేలర్ వెల్లడించాడు. 
 
ఇంకా బుమ్రా గురించి టేలర్ మాట్లాడుతూ.. డెత్ ఓవర్లను విసరడంలో ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ బూమ్రానే. అతనిని ఎలా ఎదుర్కోబోతున్నామనే ప్రశ్నకు తన వద్ద ఇప్పటికీ సమాధానం లేదు. బుమ్రాను ఎదుర్కునే అంశంపై ఆ రోజు ఉదయం మూడు గంటలకే లేచి కూర్చుని మరీ ఆలోచించడం ప్రారంభించాను. ఆ రోజు రాత్రంతా నిద్రలేకుండా గడిపానని టేలర్ చెప్పుకొచ్చాడు. 
 
ముఖ్యంగా బుమ్రా బౌలింగ్‌లో తమ జట్టు సరిగ్గా ఆడలేదు. ఇంకా బుమ్రా బౌలింగ్ చేసేటప్పుడు.. తాము బ్యాటింగ్‌లో తడబడ్డామనే విషయాన్ని తప్పకుండా ఒప్పుకోవాల్సిందేనని టేలర్ వ్యాఖ్యానించాడు.దీనిపై మరింత చదవండి :