గర్ల్స్ లిక్కర్ పార్టీ: రాత్రంతా మద్యం సేవించి తెల్లారేసరికి శవమైంది
తాగుబోతుల సంగతి మనకి తెలిసిందే. రోడ్లపైన అర్థరాత్రి వేళల్లో మత్తులో మునిగిపోయి పడిపోయి కనిపిస్తుంటారు. ఇంకొందరు తూలుతూ ఊగుతూ ఎలాగో ఇంటికి చేరుకుంటారు. కానీ మరికొందరు మరీ అతిగా సేవించి ప్రాణాల మీదికి తెచ్చుకుంటుంటారు. ఐతే ఇక్కడ మద్యం అతిగా సేవించింది పురుషుడు కాదు ఓ యువతి. ఇటీవలి కాలంలో అమ్మాయిలు కూడా ఎవరిదైనా పుట్టినరోజు లేదా పెళ్లిరోజు వస్తే మద్యం పార్టీ చేసుకుంటున్నారు.
చక్కగా తాగుతూ హ్యాపీగా డ్యాన్సులు చేస్తూ మజా చేసుకుంటున్నారు. ఐతే ఇలాంటి మజా కాస్తా చెన్నైలోని పడూరులో అమ్మాయిల మద్యం పార్టీ విషాదంగా మారింది. ఏకత్తూరులోని తన స్నేహితురాళ్లతో అపార్టుమెంటులో పూటుగా మద్యం సేవించిన అశ్విని అనే విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. తొలుత తీవ్రమైన వాంతులు కావడంతో తనకు కళ్లు కూడా సరిగా కనిపించడంలేదని చెప్పింది. దీనితో వెంటనే ఆమెను కేళంబాక్కంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స ఫలించక ఆమె ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.