సంబంధిత వార్తలు
- హైదరాబాద్‌లో కుండపోత వర్షం : నిమిషాల వ్యవధిలో రహదారులు జలమయం
- ప్రశాంతంగా ముగిసిన గణేశ్ నిమజ్జనం : సీఎం రేవంత్ ప్రశంసలు
- ఆంధ్రా కేడర్ ఐఏఎస్ అధికారి అక్రమ సంబంధం.. అనుమానంతో మహిళను చంపేసి....
- అర్థంకాని చదువు చదవలేక చావే దిక్కైంది.. సూసైడ్ లేఖలోని ప్రతి అక్షరం ఓ కన్నీటి చుక్క..
- Breaking News: హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు
ఏదో శక్తి రమ్మని పిలుస్తుందని చెరువులో దూకి బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య
తనను ఏదో శక్తి రమ్మని పిలుస్తుందని పేర్కొంటూ ఓ బ్యాంకు మేనేజరు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఘటన హన్మకొండ జిల్లాలో జరిగింది. ఈ జిల్లాలోని రాంనగర్‌కు చెందిన బర్ల సురేందర్ (36) అనే వ్యక్తి బ్యాంకు మేనేజరుగా పని చేస్తూ హైదరాబాద్ నగరంలోని రామంతపూర్‌లో భార్యాపిల్లలతో కలిసి జీవిస్తున్నారు.
అయితే, ఆయన తాజాగా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. తనను ఏదో శక్తి పిలుస్తోందని వెళ్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తనపై క్షుద్రపూజలు జరిగాయని అనుమానంతో మంత్రగాళ్ళను ఆయన కలిశారు. ఆ తర్వాత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడ్డాడు. ఈ క్రమంలో ఆయన తాజాగా ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
తర్వాతి కథనం
