గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : సోమవారం, 10 జులై 2023 (12:07 IST)

ఉద్యోగిని హత్య చేసి.. విద్యుత్ షాక్‌గా చిత్రీకరించే ప్రయత్నం

కర్నాటక రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. తన వద్ద పని చేసే ఓ ఉద్యోగిని హత్య చేసి, దాన్ని విద్యుత్ షాక్‌గా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని మంగళూరులో శనివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే గజానన్‌ ఓ కిరాణా షాపులో పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం యజమానికి, అతడికి చిన్న వివాదం జరిగింది. 
 
దీంతో కోపోద్రిక్తుడైన ఆ యజమాని అతడికి నిప్పంటించి హతమార్చాడు. అనంతరం గజానన్‌కు విద్యుత్‌ షాక్‌ కొట్టిందని ఊళ్లో తప్పుడు ప్రచారం చేశాడు. అంతేకాకుండా ఆస్పత్రికి కూడా తరలించాడు. అప్పటికే అతడు మరణించాడని వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సమయంలో యజమానిపై అనుమానం వచ్చి విచారించగా అతడు నేరాన్ని అంగీకరించాడు.