ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 6 జనవరి 2023 (13:44 IST)

మూసాపేట మెట్రో స్టేషన్‌లో రైలు కింద దూకిన వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్ నగరంలోని మూసాపేట మెట్రో స్టేషన్‌లో ఓ వ్యక్తి మెట్రో ట్రైన్‌‍ కింద దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సదరు వ్యక్తి టిక్కెట్ లేకుండా మెట్రో స్టేషన్ నుంచి ఫ్లాట్‌పాంపైకి వెళ్లి మెట్రో టైన్‌ వస్తుండగా దూకేశాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ ఘటనపై మూసాపేట్ స్టేషన్ కంట్రోలర్ పులెందర్ రెడ్డి పోలీసులు ఫిర్యాదు చేశాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాల కోసం పోలీసుల ఆరా తీస్తున్నారు.