మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 23 ఆగస్టు 2021 (22:40 IST)

ప్రేమ చంపేసింది: అమ్మా... ఈ రోజు ఆ గదిలో పడుకుంటానని చెప్పి...

ఒన్ సైడ్ లవ్ అతడిని చంపేసింది. ఆమెను ప్రేమించానని చెప్పాడు. తనకు ఇష్టం లేదని సదరు యువతి ముఖం మీదే చెప్పేసింది. దాంతో అతడు ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 
వివరాల్లోకి వెళితే... తిరుపతికి చెందిన నిరాజ్ తన తల్లిదండ్రులతో కలిసి ఎస్సార్ నగర్ లోని ఓ అపార్టుమెంటులో అద్దెకి వుంటున్నారు. నిరాజ్ సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. కంపెనీలో విధులు నిర్వహించేందుకు వెళ్తున్న నిరాజ్ ఓ యువతి పట్ల ఆకర్షితుడయ్యాడు. తనను ప్రేమిస్తున్నట్లు ఆమెతో చెప్పాడు. ఆమె తనకు ఇష్టంలేదని చెప్పేసింది. ఆమె నిరాకరించిందని తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
 
ఆదివారం రాత్రి తన తల్లిదండ్రులతో తను వేరే గదిలో నిద్రపోతానని చెప్పాడు. అలా నిద్రపోయిన నిరాజ్‌ను ఉదయాన్నే నిద్ర లేపేందుకు తండ్రి ప్రయత్నించాడు. కానీ ఎంతకీ అతడు నిద్రలేవపోయేసరికి గదిలో అంతా కలియ చూడగా పక్కనే సైనైడ్ బాటిల్ లభ్యమైంది. సెల్ ఫోన్ చూడగా అందులో ఓ యువతి ఫోటో వుంది. ఆమెను తను ప్రేమించానని, నిరాకరించడంతో సూసైడ్ చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.