ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (11:14 IST)

బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య!!

suicide
తెలంగాణా రాష్ట్రంలోని బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్ జిల్లా బాసరలోని ఆర్జీయూకేటీలో ఈ విషాదకర ఘటన జరిగింది. ఇక్కడ పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అరవింద్ అనే విద్యార్థి తాను ఉండే హాస్టల్ గదిలోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అరవింద్ మరణించినట్టు వైద్యులు తెలిపారు. మృతుడి స్వస్థలం సిద్ధిపేట జిల్లా బండారుపల్లిగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
జగన్ కోసం మానవబాంబుగా మారిపోతా : టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ 
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కోసం తాను మానవ బాంబుగా మారిపోతానని టెక్కలి వైకాపా అసెంబ్లీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రాణాలను రక్షించుకునేందుకు ఎంతకైనా తెగిస్తానని చెప్పారు. అలాగే, వైకాపా కార్యకర్తలంతా జగన్‌కు రక్షణ కవచంలా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. తాము తలచుకుంటే చంద్రబాబు నాయుడు రోడ్డెక్కే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. జగన్ సూచనతోనే తాము సంయమనం పాటిస్తున్నామని తెలిపారు. 
 
జగన్‌పై విసిరిన రాయి నుదిటిపై తగిలింది కాబట్టి సరిపోయిందని, అదే కొంచెం ఎడమ వైపో, కుడివైపో తలిగివుంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. జగన్‌పై ఆధారపడిన కోట్లాడిమంది ప్రజల జీవితాలు ఏమయ్యేవని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే జగన్‌నము రక్షించుకునేందుకు తానే కాదని, తనలాంటి లక్షలాది మంది ఆత్మాహుతి బాంబులం అవుతామని శ్రీనివాస్ హెచ్చరించారు.