ఆదివారం, 3 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: బుధవారం, 10 నవంబరు 2021 (22:32 IST)

భార్య గదిలోకి ముగ్గురు స్నేహితులను పంపిన భర్త, ఆమె ఏం చేసిందంటే?

భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత భర్తపై ఉంటుంది. కానీ ఇక్కడ భర్త మాత్రం బాగా సంపాదించాడు కానీ భార్యను స్నేహితులతో ఎంజాయ్ చేయాలన్నది అతని ఆలోచన. ఎంత చెప్పినా భర్తలో మార్పు రాకపోవడంతో చివరకు అత్యంత దారుణంగా భర్తను చంపేసింది భార్య.

 
కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు సిటీకి చెందిన పలార్ స్వామికి వివాహమైంది. మొదటి భార్య చనిపోయింది. దీంత రెండవ వివాహం చేసుకున్నాడు. భార్య పేరు నేత్ర. ఈమె బ్యూటీషియన్.

 
ఆర్థికంగా బాగా నిలదొక్కుకున్న పలార్ స్వామికి స్నేహితులంటే ఎంతో ఇష్టం. ఆర్థిక ఇబ్బందులతో ఒకప్పుడు బాధపడుతుంటే ఎవరూ పట్టించుకోలేదు. అయితే స్నేహితులే తనను ఆదుకోవడంతో ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నట్లు పలార్ స్వామి భావించేవాడు.

 
స్నేహితులు పలార్ స్వామి భార్యపై కన్నేశారు. మొత్తం ముగ్గురు స్నేహితులు ఆమెతో శారీరకంగా కలవాలని పలార్ స్వామిని అడిగారు. దీంతో ఏమాత్రం ఆలోచించకుండా ముగ్గురు స్నేహితులను భార్య గదిలోకి పంపాడు.

 
కానీ అది నచ్చని నేత్ర భర్తతో వాగ్వాదానికి దిగింది. ఎంతకూ వినిపించుకోలేదు. దీంతో నిద్రిస్తున్న భర్తను దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేసింది. చివరకు ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అయితే పోలీసుల విచారణలో హత్య అని తేలడంతో నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.