గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 22 జనవరి 2022 (10:47 IST)

విడాకులు ఇప్పించమంటే వివాహితను అలా చేసి లొంగదీసుకున్న న్యాయవాది, ఆ తర్వాత?

భర్తతో తీవ్ర మనస్పర్థలు రావడంతో అతడితో విడాకులు తీసుకోవాలని భావించింది 25 ఏళ్ల వివాహిత. ఈ క్రమంలో ఓ న్యాయవాదిని సంప్రదించింది. తనకు న్యాయం చేయాలంటూ కోరింది. ఐతే ఆ న్యాయవాది ఆమెపై కన్నేసాడు. చివరికి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసాడు.

 
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ మల్కాజిగిరిలో నివాసం వుంటున్నారు రెండేళ్ల క్రితం పెళ్లయిన భార్యాభర్తలు. ఐతే వీరిద్దరూ తరచూ గొడవలు పడుతున్నారు. భర్త వేధింపులను తాళలేని వివాహిత విడాకుల కోసం న్యాయవాదిని సంప్రదించింది .

 
గత ఏడాది జూన్ నెలలో అతడి వద్దకు వెళ్లి తనకు విడాకులు ఇప్పించాలని కోరింది. ఈ వంకతో ఆమెను పలుమార్లు తన ఆఫీసుకి రప్పించుకున్న న్యాయవాది ఆమెపై కన్నేసాడు. భర్తతో విడిపోయిన ఆ యువతి అద్దె ఇంటి కోసం వెతుకుతోంది. ఇది తెలుసుకున్న న్యాయవాది తన ఇంటికి సమీపంలో ఓ ఫ్లాట్ అద్దెకి వుందని చెప్పి అందులో ఆమెకి తెలియకుండా సిసి కెమేరాలు పెట్టాడు.

 
ఇంట్లో దుస్తులు మార్చుకుంటున్న సమయంలో రికార్డయిన దృశ్యాలను ఆమెకి చూపించి తన కోర్కె తీర్చకపోతే బయటపెడతానని బెదిరించాడు. దీనితో ఆమె నిస్సహాయురాలై అతడికి లొంగిపోయింది. ఐతే ఇటీవల అతడి వేధింపులు తీవ్రస్థాయికి చేరడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి తనపై జరుగుతున్న దారుణాన్ని చెప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.