శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2023 (18:55 IST)

నీ భర్తను చంపేస్తావా? లేదా? ప్రియుడి హెచ్చరిక.. అంతపని చేసిన భార్య!

murder
ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా జరుగుతున్న హత్యలు ఎక్కువైపోతున్నాయి. తాజాగా ఓ మహిళ తన ప్రియుడి మాటలు విని కట్టుకున్న భర్తను కడతేర్చింది. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మెడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని అవుషాపూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
అవుషాపూర్‌కు చెందిన ఈ నెల 6వ తేదీన మృతి చెందాడు. నాలుగేళ్ల క్రితం దుబాయ్‌కు వెళ్లిన రెండేళ్ళ క్రితం తిరిగివచ్చి ఇక్కడే కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఈయనకు భార్య షానాబీతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, మౌలానా విదేశాలకు వెళ్లిన సమయంలో షానాబీకి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో మౌలానా విదేశాల నుంచి వచ్చిన తర్వాత షానాబీని కలుసుకోవడం ప్రియుడికి ఆటంకంగా మారింది. దీంతో భర్తను మట్టుబెట్టాలంటూ షానాబీపై ఒత్తిడి తెచ్చాడు. తాను చెప్పినట్టు వింటావా లేదా అంటూ బెదిరించసాగాడు. 
 
ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీన మద్యం సేవించేందుకు మౌలానా వంద రూపాయలు ఇవ్వాలని అడగ్గా ఆమె డబ్బులు ఇవ్వకుండా ఇంట్లో ఉన్న మద్యం సీసాను తెచ్చి ఇచ్చింది. దాన్ని సేవించిన మౌలానాకు కొద్దిసేపటికి కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో హడావుడిగా గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. 
 
అయితే, తన భర్త మృతదేహానికి శవపరీక్ష చేయొద్దంటూ షాబీనా పట్టుబట్టడంతో వైద్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడైంది. అదేసమయంలో మౌలానా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా, అందులో గుర్తు తెలియని విషం సేవించడం వల్ల చనిపోయినట్టు వైద్యులు తేల్చారు. 
 
దీంతో షాబీనాను అరెస్టు చేశారు. తన ప్రియుడు చెప్పినట్టు వినకపోతే చంపేస్తానని బెదిరించాడని, అందుకే తన భర్తకు విషమిచ్చినట్టు పోలీసులకు వాంగ్మాలం ఇచ్చింది. పరారీలో ఉన్న ఆమె ప్రియుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.