శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 జూన్ 2023 (10:40 IST)

ఢిల్లీకి చంద్రబాబు.. అమిత్ షా, ప్రధానితో భేటీ అవుతారా?

chandrababu naidu
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి ప్రయాణం కానున్నారు. ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఢిల్లీలో చంద్రబాబు పర్యటించనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. 
 
ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆయన సమావేశం కానున్నారు. ప్రధాని మోదీని కూడా కలిసే అవకాశాలు ఉన్నాయని టాక్ వస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం వుందని తెలుస్తోంది.