శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సిహెచ్
Last Modified: గురువారం, 12 మే 2022 (14:07 IST)

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం, విశిష్టత ఏంటి?

Nurse Day
అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఫ్లారెన్స్ నైటింగేల్ చేసిన అద్భుతమైన పని కారణంగా మే 12 నర్సుల సహకారాన్ని స్మరించుకునే రోజుగా ఎంపిక చేయబడింది. మే 12, 1820న జన్మించిన ఫ్లారెన్స్ నైటింగేల్ బ్రిటీష్ నర్సు, సంఘ సంస్కర్త. ఆమెను "ది లేడీ విత్ ది ల్యాంప్"గా గౌరవించారు.

 
1850లలో క్రిమియన్ యుద్ధం సమయంలో, ఫ్లారెన్స్ నైటింగేల్ నర్సుగా ఎనలేని సేవలు అందించారు. గాయపడిన బ్రిటీష్ సైనికులను చూసుకునే నర్సుల బృందానికి ఆమె బాధ్యత వహించే ఆసుపత్రిలో పనిచేసారు. ఆమె మొదట ఆసుపత్రికి వచ్చినప్పుడు, సౌకర్యాలు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో చూసి ఆశ్చర్యపోయారు.

 
వెంటనే ఆమె ఆసుపత్రి వార్డులను శుభ్రంగా వుంచేందుకు చర్యలు తీసుకున్నారు. అంతేకాదు... ఆహారం- వైద్య సామాగ్రిని రోగులకు ఎల్లవేళలా అందుబాటులో వుండేవిధంగా నిల్వ ఉండేలా చూసుకున్నారు. అంతటి అద్భుతమైన సేవలు అందించడమే కాకుండా 1860లో లండన్‌లోని నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్‌కు పునాది వేశారు.