గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By సిహెచ్
Last Modified: శనివారం, 9 అక్టోబరు 2021 (22:54 IST)

ఆకర్షణీయమైన, ప్రకాశవంతమైన పండుగ కలెక్షన్‌ను తీసుకువచ్చిన సోచ్‌

సోచ్‌ తీసుకువచ్చిన పూర్తి సరికొత్త, ప్రకాశవంతమైన పండుగ కలెక్షన్‌తో ఈ పండుగను మరింత ఆహ్లాదంగా మార్చుకోండి. ఈ కలెక్షన్‌లో అత్యంత అందమైన, మహోన్నతమైన ఫ్యాబ్రిక్స్‌ అయినటువంటి సిల్క్‌, సిల్క్‌ బ్లెండ్‌, ముస్లిన్స్‌, చందేరీ మరియు జార్జెట్‌ వంటివి ఉన్నాయి. ఈ సీజన్‌కు అత్యంత అందంగా ఇవి నిలుస్తాయి. ఈ నూతన కలెక్షన్‌లో సల్వార్‌ సూట్లు, డ్రెస్‌ గౌన్లు, కుర్తీ సూట్లు, లేయర్డ్‌ కుర్తాలు, చీరలు, హెవీ దుపట్టాలు వంటివి ఉన్నాయి. వైవిధ్యమైన ఈ కలెక్షన్‌ విస్తృత శ్రేణి రంగులలో లభ్యమవుతాయి.
 
ఈ పండుగ కలెక్షన్‌ ఆవిష్కరణ గురించి సోచ్‌ సీఈఓ, వినయ్‌ చట్లానీ మాట్లాడుతూ, ‘‘మా నూతన కలెక్షన్‌తో, మేము విస్తృత శ్రేణి రంగులు, ఆకర్షణీయమైన ప్రింట్లతో వైవిధ్యమైన డిజైన్లను తీసుకువచ్చాం. ఈ కలెక్షన్‌ను పండుగ సంతోషాన్ని మనసులో ఉంచుకుని తీర్చిదిద్దాం. ఈ వస్త్రాలు ఆహ్లాదకరమైన అనుభవాలను అందించడంతో పాటుగా సౌకర్యంగానూ ఉంటాయి’’ అని అన్నారు.
 
ఆధునిక, క్లాసిక్‌ ఫ్యాషన్‌ల సమ్మేళనంలా సోచ్‌ యొక్క నూతన కలెక్షన్‌ ఉంటుంది. సోచ్‌ నుంచి పండుగ కలెక్షన్‌తో  ప్రతి వేడుకనూ అత్యంత అందంగా మలుచుకోండి. కుర్తీ సూట్ల ధరలు 3498 రూపాయలు, సూట్‌ సెట్స్‌ 6998 రూపాయలు, కుర్తాలు 1498 రూపాయలు మరియు చీరలు 4998 రూపాయల నుంచి లభ్యమవుతాయి. ఈ కలెక్షన్‌ అన్ని సోచ్‌ ఔట్‌లెట్లు, ఆన్‌లైన్‌లో లభ్యమవుతాయి.