బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (14:04 IST)

అందంతో అన్ని సమయాల్లో ఆనందంగా ఉండాలంటూ టీరా క్యాంపెయిన్

Kiara-Kareena
దేశవ్యాప్తంగా అగ్రగామి సంస్థగా పేరుతెచ్చుకున్న రిలయన్స్ రిటైల్ నుంచి వచ్చిన మరో అద్భుతమైన ఓమ్ని ఛానల్ బ్యూటీ రిటైల్ ప్లాట్ ఫామ్ టీరా. రీసెంట్‌గా టీరా తమ మొదటి ప్రచారం క్యాంపెయిన్‌ని రూపొందించింది. ఇందులో కరీనా కపూర్ ఖాన్, కియారా అద్వానీ, సుహానా ఖాన్‌ కన్పించారు. ఈ క్యాంపెయిన్ ద్వారా తమ మొదటి హై డెసిబెల్ 360-డిగ్రీ క్యాంపెయిన్ “ForEveryYou”ను ప్రారంభించినట్లు ప్రకటించింది టీరా. టీరా “ForEveryYou” క్యాంపెయిన్ ద్వారా ఇంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించే వ్యక్తులు అనుభవించే అద్భుతమైన భావాలు, భావోద్వేగాలు మరియు మనోభావాలకు నివాళిగా ఉపయోగపడుతుంది. అందం యొక్క గొప్పదనాన్ని, అది ఇచ్చే ఆత్మస్థైర్యాన్ని ప్రజలు ఎలా ఉపయోగించుకుంటారో తెలుసుకోవడమే ఈ క్యాంపెయిన్ లక్ష్యం.
 
కరీనా కపూర్ ఖాన్ , కియారా మరియు సుహానా అందం యొక్క విభిన్నమైన మరియు ప్రత్యేకమైన సంస్కరణలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ముగ్గురూ విడివిడిగా 30 సెకన్ల ఎక్స్ క్లూజివ్ ఫిల్మ్ లో నటించారు. విభిన్న మనస్తత్వాలు, రోజువారీ ఆచారాలు మరియు చిన్న చిన్న సరదాలు ఒక వ్యక్తిని ఎలా మారుస్తాయో, వారు తమ అందాన్ని ఎలా నిర్వచించాలో ఈ ఫిల్మ్ లు నొక్కిచెప్పేందుకు ప్రయత్నించాయి. ఈ క్యాంపెయిన్ సెల్ఫ్ ఎక్స్ ప్రెషన్ ను ప్రోత్సహించడం, అందాన్ని కనుక్కునే ప్రయాణంలో వ్యక్తులు ఎక్కడ ఉన్నా, వారి ప్రామాణికతను అన్వేషించడానికి మరియు వ్యక్తీకరించడానికి వ్యక్తులకు శక్తినివ్వడం లక్ష్యంగా పెట్టుకుంది.
 
ఈ "For Every You" క్యాంపెయిన్ కు సంబంధించిన ప్రచారాన్ని రాబోయే నెలల్లో మరింత ఉదృతిగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా టీవీ, అవుట్‌డోర్, ప్రింట్ మీడియా, డిజిటల్, ప్రైమ్ మీడియా ఛానెల్స్, ఈవెంట్‌లు, స్టోర్ యాక్టివేషన్‌లతో పాటు మరిన్ని ఆన్-గ్రౌండ్ కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఉత్తమ గ్లోబల్ మరియు స్వదేశీ బ్రాండ్‌లతో లాంచింగ్ యొక్క గొప్పదనం అందరికి తెలిసేలా రూపొందించేలా సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా లాంచ్ సందర్భంగా ఆఫర్‌లు, ప్రమోషన్‌లు మరియు బహుమతులతో ప్రతీ ఒక్కరూ టీరా స్టోర్ కి వచ్చేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.
 
ఈ సందర్భంగా క్యాంపెయిన్ పై రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీమతి ఇషా అంబానీ మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ..., “ఏప్రిల్ 2023లో మేము దీన్ని ప్రారంభించినప్పటి నుండి టీరా బ్యూటీకి అద్భుతమైన స్పందన వచ్చింది. అందం మరియు చర్మ సంరక్షణ విభాగంలోని అడ్డంకులను తొలగించి, వాటిని అందరికి అందుబాటులోకి తీసుకురావడమే టీరా యొక్క లక్ష్యం. టీరా కుటుంబంలోకి కరీనా కపూర్ ఖాన్, కియారా అద్వానీ మరియు సుహానా ఖాన్‌లను మేము స్వాగతిస్తున్నాం. అంతేకాకుండా మా మొట్టమొదటి ప్రచారం #ForEveryYouలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ క్యాంపెయిన్ భాగస్వామ్యం అందానికి సంబంధించినది మాత్రమే కాదు, ఇది వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకోవడం, ప్రతి ఒక్కరూ తమ అందాన్ని మరింతగా ఇనుమడింపు చేసుకునేలా ప్రోత్సహించడం మా యొక్క ముఖ్య ఉద్దేశం. వారంతా టీరా బ్రాండ్ కు ప్రాతినిధ్యం వహిస్తారు.
 
అందాన్ని ఇష్టపడేవారికి, అందం ద్వారా తమ వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే వారికి, ఇంకా చెప్పాలంటే అన్ని సంస్కృతుల వారికి, విభిన్నవయస్సు ఉన్న వారికి కూడా ప్రేరణగా నిలుస్తారు.