సోమవారం, 18 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By chitra
Last Updated : బుధవారం, 12 అక్టోబరు 2016 (16:18 IST)

మహిళలూ శరీరాకృతికి తగ్గట్టు దుస్తులు ఎంచుకోండి.. సింథటిక్ శారీస్ బెస్ట్..

మహిళలు వారి వారి శరీరాకృతికి తగ్గట్టు దుస్తులు ధరించడం అలవాటు చేసుకోవాలి. తమ శరీరాకృతికి తగినట్లు దుస్తులు ధరించడం ద్వారా పార్టీల్లో ఇతరులను ఇట్టే ఆకర్షించవచ్చు. ముఖ్యంగా ఎత్తుగా ఉన్న మహిళలకు పార్టీకి

మహిళలు వారి వారి శరీరాకృతికి తగ్గట్టు దుస్తులు ధరించడం అలవాటు చేసుకోవాలి. తమ శరీరాకృతికి తగినట్లు దుస్తులు ధరించడం ద్వారా పార్టీల్లో ఇతరులను ఇట్టే ఆకర్షించవచ్చు. ముఖ్యంగా ఎత్తుగా ఉన్న మహిళలకు పార్టీకి వెళ్లినప్పుడు స్ప్రింగ్‌తో తయారైన దుస్తులు బాగా అబ్బుతాయి. అలాగే లిటిల్ బ్లాక్ డ్రెస్‌లు వేయవచ్చు. 
 
అయితే పొడవాటి డ్రెస్సులను వేయకూడదు. స్కట్స్ లాంటివి వేయడం ద్వారా మీ ఎత్తు పెద్దగా తెలియదు. అలాగే చీరల సంగతి కొస్తే అడ్డుగీతలతో కూడినవి వాడవచ్చు. రంగుల ఎంపికలోనూ ఎత్తుగా ఉండేవారు మైల్డ్ కలర్స్ ఎంచుకోవడం బెటర్. 
 
లావుగా ఉన్నవారికి సింథటిక్ శారీస్ బెస్ట్. సింథటిక్ శారీస్ కట్టేటప్పుడు హ్యాండిల్ వర్క్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. హ్యాండ్ వర్క్ శారీస్, ఫ్రేమ్, మిరర్ వర్క్, మందపాటి చీరలు కట్టడం ద్వారా ఎత్తుగా ఉండేవారు తమ డ్రెస్సింగ్ విధానం అందరినీ ఆకట్టుకుంటుందని డిజైనర్లు అంటున్నారు.