మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By
Last Updated : శనివారం, 1 డిశెంబరు 2018 (17:36 IST)

బ్రెడ్ రొయ్యల పకోడీ తయారీ విధానం...

రొయ్యలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలోని మినరల్స్ జ్ఞాపకశక్తిని పెంచుటకు సహాయపడుతాయి. పిల్లల ఎదుగు దలకు మంచి ఆహార పదార్థం. మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతాయి. కంటి చూపుకు మంచి ఉపశమనం కల్పిస్తుంది. ఇలాంటి రొయ్యలతో పకోడీలు ఎలా చేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు:
బ్రెడ్ ముక్కలు - 6
పచ్చి రొయ్యలు - 1 కప్పు
గుడ్డు - 1
తరిగిన ఉల్లికాడలు - 2
అల్లం ముక్క - చిన్నది
సోయాసాస్ - 2 స్పూన్స్
మెుక్కజొన్నపిండి - 1 స్పూన్
మసాలా పొడి - అరస్పూన్
వేయించిన నువ్వులు - అరకప్పు
నూనె - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా రొయ్యలు, గుడ్డు సొన, ఉల్లికాడలు, అల్లం, మెుక్కజొన్నపిండి, సోయాసాస్‌ను మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కల్ని త్రికోణంలో రెండు ముక్కలుగా కట్ చేసి అందులో ఓ పక్క రొయ్యల పేస్ట్ రాసి దానిపై నువ్వులు చల్లి అవి అతుక్కునేలా ఒత్తాలి. బాణలిలో నూనె వేసి వేడయ్యాక ఒక్కో బ్రెడ్ ముక్కని బంగారు రంగు వచ్చేవరకు వేగించాలి. అంతే వేడివేడి బ్రెడీ పకోడీలు రెడీ.