శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 29 జూన్ 2020 (23:02 IST)

సగ్గుబియ్యం పునుగులు, ఎలా చేయాలో తెలుసా?

అసలే లాక్ డౌన్, బయటకు వెళ్లి ఏవో స్వీట్లు, కారపు పదార్థాలను కొనుక్కోవడానికి వీల్లేని పరిస్థితి. ఇంక ఇంట్లో పిల్లలు అల్లరి వేరే చెప్పక్కర్లేదు. చిరుతిళ్ల కోసం నానా హంగామా చేస్తారు. అలాంటివారికి సగ్గుబియ్యం పునుగులు వండిపెడితే సరి.
 
కావలసిన పదార్థాములు :
సగ్గుబియ్యం – రెండు కప్పులు
బియ్యం – ఒక కప్పు
మినపప్పు – అర కప్పు
ఉల్లిపాయలు – రెండు
పచ్చిమిర్చి – మూడు (లేదా పచ్చిమిర్చి పేస్టు కూడా వాడకోవచ్చు)
అల్లం – చిన్న ముక్క
ఉప్పు – తగినంత
జీలకర్ర – కొద్దిగా
నూనె – నాలుగు టీ స్పూన్స్
 
తయారు చేయు విధానం :
1) ముందుగా సగ్గు బియ్యం, బియ్యం, మినపప్పు ఆరు గంటలు ముందు నాన బెట్టాలి.
2) తరువాత మిక్సి వేసి మెత్తగా దోశ పిండిలా చేసుకోవాలి.
3) ఇలా చేసిన ఈ పిండిని ఆరు గంటలు పక్కన పెట్టాలి. ఇలా పెడితే ఇది పులిసి పునుగులు బాగా వస్తాయి.
4) ఇప్పుడు స్టవ్ పైన గుంట పొంగడాలు వేసుకొనే పాన్ పెట్టుకొని ఈ గుంటల్లో ఒక స్పూన్ నూనె వేసుకోవాలి.
5) ఇప్పుడు ఉల్లి, మిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకు ముక్కలుగా చేసుకోవాలి.
6) ఇలా కట్ చేసిన ముక్కలు, జీలకర్ర, ఉప్పు రెడి చేసిన పిండిలో వేసి బాగా కలపాలి.
7) ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని చిన్నచిన్న పునుగుల్లా వేసుకోవాలి.
8) వీటి ఒకవైపు వేగాక రెండోవైపు తిప్పి వీటిపై మళ్లీ ఒక స్పూన్ నూనె వేసుకోవాలి.
9) రెండు వైపులా వేగిన తరువాత ఒక ప్లేట్ లోకి తీసుకొని మీకిష్టమైన చట్నితో తీసుకుంటే చాలా రుచిగా ఉంటాయి.