1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By Selvi
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2016 (12:55 IST)

టమోటా-ఎగ్ ఆమ్లెట్ ఎలా చేయాలంటే?

టమోటాలో విటమిన్ బి, సీ, విటమిన్ పీ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండే టమోటాలో బీపీని తగ్గిస్తుంది. అనీమియాను దూరం చేసుకోవాలంటే రోజూ ఓ కోడిగుడ్డును తీసుకోవడం మంచిది. నిద్రలేమి తగ

టమోటాలో విటమిన్ బి, సీ, విటమిన్ పీ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండే టమోటాలో బీపీని తగ్గిస్తుంది. అనీమియాను దూరం చేసుకోవాలంటే రోజూ ఓ కోడిగుడ్డును తీసుకోవడం మంచిది. నిద్రలేమి తగ్గాలంటే.. కోడిగుడ్డును అల్పాహారంగా తీసుకుంటే సరిపోతుంది. ఈ రెండింటితో ఆమ్లెట్ ట్రై చేస్తే ఎలా ఉంటుంది. 
 
కావలసిన పదార్థాలు :
కోడిగుడ్లు - 2 
టమోటాలు - 2 
శెనగపిండి - పావు కప్పు
ఉప్పు- తగినంత  
పచ్చిమిర్చి- 2 
కొత్తిమీర  తరుగు - పావు కప్పు 
పెరుగు - కాసింత 
బేకింగ్ సోడా - కాసింత 
 
తయారీ విధానం : 
ముందుగా టమోటా ముక్కలను కట్ చేసి పెట్టుకోవాలి. ఓ బౌల్‌లో శెనగపిండి, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పెరుగు, బేకింగ్ సోడాలను కలిపి బాగా మిక్స్ చేయాలి. ఇందులో రెండు కోడిగుడ్లు కొట్టి గిలకొట్టుకోవాలి. ఆమ్లెట్ మిశ్రమంలా తయారు చేసుకున్నాక.. దోసె పెనం పెట్టి ఆమ్లెట్ పోసుకుంటే.. టమోటా ఎగ్ ఆమ్లెట్ రెడీ అయినట్లే.