బుధవారం, 6 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By selvi
Last Updated : బుధవారం, 9 మే 2018 (18:41 IST)

#HanumanJayanthi రోజున ఏ చిత్ర పటాన్ని ఉపయోగించాలి? తమలపాకుల పూజతో?

హనుమజ్జయంతి రోజున పాటించాల్సిన విధి విధానాలు ఏంటో చూద్దాం.. హనుమంతుడు ఆరాధన చేయడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. హనుమంతుడు లంకా నగరానికి వెళ్లే ముందు ఓ మాట చెప్తాడు. ''రాముని బాణం వలె పనిచేస్తాను'' అని

హనుమజ్జయంతి రోజున పాటించాల్సిన విధి విధానాలు ఏంటో చూద్దాం.. హనుమంతుడు ఆరాధన చేయడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. హనుమంతుడు లంకా నగరానికి వెళ్లే ముందు ఓ మాట చెప్తాడు. ''రాముని బాణం వలె పనిచేస్తాను'' అని ఆ సందర్భంలోనే కాకుండా ఎక్కడైనా అదే మాటను హనుమంతుడు చెప్తుంటాడు.


అలాగే హనుమంతుడికి చాలా నచ్చిన సన్నివేశం ఏంటంటే, సీతారామలక్ష్మణులున్న సన్నివేశంలో తాను వుండటమే. అందుకే హనుమజ్జయంతి రోజున హనుమంతుడి విగ్రహం లేదా ప్రతిమను పూజించకుండా..  సీతారామలక్ష్మణులు పట్టాభిషిక్తులై వుండే చిత్రపటంతో పూజ చేయాలి. 
 
రామ, సీత అష్టోత్తరాలు చెప్పి.. ఆపైనే హనుమాన్ అష్టోత్తరంతో స్తుతించాలి. 108 హనుమాన్ అష్టోత్తరాలకు 108 తమలపాకులతో అర్చించాలి. లేకుంటే సింధూరంతో అర్చన చేయాలి. చేతనైన నైవేద్యం చేయవచ్చు. ముఖ్యంగా దానిమ్మ పండును నివేదించడం లేదా రెండు అరటి పండ్లు నివేదించవచ్చు. అరటిపండు సృష్టికి సంకేతం, దానిమ్మ పండు మన కోరికలకు సంకేతం. 
 
ఇంకా స్వామికి పానకం, వడపప్పు నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆలయాల్లో హనుమాన్ పేరిట అర్చన చేయవచ్చు. తమలపాకు సృష్టించబడింది కాదని.. ఇంద్రుడు ఐరావతాన్ని కట్టి వుంచే స్తంభానికి తీగల్లా పుట్టుకొచ్చిందని.. అదే పవిత్రమైన తమలపాకుగా మారిందని.. దీన్ని ఈ లోకాన్ని సృష్టించిన బ్రహ్మదేవుడు సృష్టించలేదని పురాణాలు చెప్తున్నాయి. 
 
అలాంటి మహిమాన్వితమైన తమలపాకులతో హనుమజ్జయంతి రోజున హనుమాన్‌ను అర్చించే వారికి కోరిక కోరికలు నెరవేరుతాయి. సృష్టికి దూరమైన, పవిత్రమైన తమలపాకులతో ఉన్నతమైన హనుమంతునికి పూజ చేయడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయి.