బుధవారం, 8 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By selvi
Last Updated : శనివారం, 17 మార్చి 2018 (11:07 IST)

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఉగాది పాట (వీడియో)

ఉగాది పండుగను తెలుగు ప్రజలు ఆదివారం (మార్చి 18వ తేదీ) అట్టహాసంగా జరుపుకోనున్నారు. ''ఉగాది'' అంటే ప్రకృతి పుట్టినరోజు. కాలగణనానికి కూడా ఉగాదే శ్రీకారం. చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే ఉగాదిగా జరుపుకుంటారు.

ఉగాది పండుగను తెలుగు ప్రజలు ఆదివారం (మార్చి 18వ తేదీ) అట్టహాసంగా జరుపుకోనున్నారు. ''ఉగాది'' అంటే ప్రకృతి పుట్టినరోజు. కాలగణనానికి కూడా ఉగాదే శ్రీకారం. చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే ఉగాదిగా జరుపుకుంటారు. ప్రకృతి అందరికీ తల్లి. అందువల్ల ప్రకృతి మాత పుట్టినరోజును జరుపుకునేందుకే ప్రకృతి తల్లిని ఉగాది రోజున పూజిస్తాం. 
 
ఉగాది రోజున తలంటు స్నానం, కొత్త బట్టలు, పచ్చడి, పంచాంగ శ్రవణం వినే తెలుగు ప్రజల ఉత్సాహాన్ని రెట్టింపు చేసే పాటొకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పాటను గాయని మధుప్రియ పాడారు. ఈ పాట వీడియోను మీరూ ఓ లుక్కేయండి.