సాకర్ ప్రపంచకప్‌లో సంచలనం: జర్మనీ ఓడిపోయింది.. ఫ్యాన్స్ షాక్!
సాకర్ ప్రపంచకప్‌లో సంచలనం చోటుచేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ జర్మనీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌ల జర్మనీ దక్షిణ కొరియా చేతిలో ఖంగుతింది. ఇంజూరీ టైంలో రెండు గోల్స్ చేసి జర
సాకర్ ప్రపంచకప్‌లో సంచలనం చోటుచేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ జర్మనీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌ల జర్మనీ దక్షిణ కొరియా చేతిలో ఖంగుతింది. ఇంజూరీ టైంలో రెండు గోల్స్ చేసి జర్మనీ గుండెపగిలేలా చేసింది సౌత్ కొరియా. 92వ నిమిషంలో కిమ్ యాంగ్వాన్, 96వ నిమిషంలో సంన్ హ్యూంగ్ మిన్ గోల్స్ చేశారు. మెక్సికో చేతిలో ఓడి.. స్వీడన్‌పై గెలిచిన జర్మనీ.. ఈ మ్యాచ్‌ని కనీసం డ్రా చేసుకున్నా బాగుండేది. కానీ గెలిచే మ్యాచ్‌లో ఓడిపోయింది.
ఈ మ్యాచ్‌లో గెలుపు కోసం సుమారు 28 షాట్స్ కొట్టినా జర్మనీ ప్లేయర్లు సక్సెస్ కాలేకపోయారు. సాకర్ చరిత్రలోనే డిఫెండింగ్ ఛాంపియన్ నాకౌట్ చేరకుండానే నిష్క్రమించడం ఇది నాలుగోసారి. 2002లో ఫ్రాన్స్, 2010లో ఇటలీ, 2014లో స్పెయిన్ ఇలాగే గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టాయి.
సాకర్ ప్రపంచకప్‌లో జర్మనీది ఘనచరిత్ర. 1990 ఛాంపియన్ అయ్యాక ప్రతీ టోర్నీలోనూ లీగ్ స్టేజ్ దాటింది. 2002 నుంచి జరిగిన ఐదు మెగా టోర్నీల్లో సెమీస్ దాకా వెళ్లింది. 2014లో అర్జెంటీనాను ఓడించి నాలుగోసారి ఛాంపియన్‌గా అవతరించిన జర్మనీ.. ఈసారి నాకౌట్ చేరకుండానే ఇంటిముఖం పట్టడం సాకర్ అభిమానులకు మింగుడుపడటం లేదు.