ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. ఫిఫా ప్రపంచ కప్ 2018
Written By pnr
Last Updated : ఆదివారం, 24 జూన్ 2018 (10:21 IST)

ఫిఫా 2018: కళ్లు చెదిరే గోల్‌తో జర్మనీ సంచలన విజయం

ఫిఫా 2018 వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో జర్మనీ జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. జర్మనీ ఆటగాడు టోనీ క్రూస్ కొట్టిన గోల్‌తో స్వీడన్‌పై జర్మనీ కళ్లు చెదిరే విజయాన్ని సొంతం చేస

ఫిఫా 2018 వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో జర్మనీ జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. జర్మనీ ఆటగాడు టోనీ క్రూస్ కొట్టిన గోల్‌తో స్వీడన్‌పై జర్మనీ కళ్లు చెదిరే విజయాన్ని సొంతం చేసుకుంది. 2-1 తేడాతో స్వీడన్‌ను ఓడించి నాకౌట్ స్టేజ్‌పై ఆశలను సజీవంగా ఉంచుకుంది.
 
తొలి మ్యాచ్‌లోనే మెక్సికో చేతిలో ఓడిన జర్మనీ.. ఈ మ్యాచ్‌లోనూ ఆరంభంలో తడబాటుకు గురైంది. అయితే, 32వ నిమిషంలో స్వీడన్ ప్లేయర్ ఓలా టోయ్‌వోనెన్ తొలి గోల్‌తో తమ టీమ్‌కు 1-0 లీడ్ అందించాడు. ఫస్ట్ హాఫ్‌లో ఒక గోల్ తేడాతో వెనుకబడిన జర్మనీ.. సెకండాఫ్‌లో తేరుకుంది. 48వ నిమిషంలో మార్కో రూయిస్ గోల్ చేయడంతో స్కోరును 1-1తో సమం చేసింది. 
 
ఈ విజయంతో గ్రూప్ ఎఫ్‌లో స్వీడన్‌తో కలిసి సంయుక్తంగా మూడు పాయింట్లతో రెండోస్థానంలో నిలిచింది జర్మనీ. రెండు విజయాలతో మెక్సికో తొలి స్థానంలో కొనసాగుతున్నది. రెండు ఎల్లో కార్డులు ఎదుర్కోవడంతో 82వ నిమిషంలో జర్మనీ ప్లేయర్ జెరోమ్ బోటెంగ్ ఫీల్డ్ వదలి వెళ్లాల్సి వచ్చింది. అప్పటి నుంచి పది మంది ప్లేయర్స్‌తో డిఫెండింగ్ చాంపియన్ పోరాడింది. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రాగా ముగిసి ఉంటే జర్మనీ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టేది.
 
అయితే 95వ నిమిషంలో అనూహ్యంగా తనకు దక్కిన ఫ్రీకిక్‌ను టోనీ క్రూస్ గోల్‌గా మలచి అసలు ఎవరూ ఊహించని విజయాన్ని సాధించిపెట్టాడు. జర్మనీ తన చివరి మ్యాచ్‌లో సౌత్ కొరియాతో తలపడనుంది. ప్రస్తుతం స్వీడన్, జర్మనీ మూడేసి పాయింట్లతో ఉన్నాయి. గోల్స్ విషయంలోనూ రెండు టీమ్స్ సమంగా ఉండటం విశేషం. జర్మనీ, స్వీడన్ రెండేసి గోల్స్ చేయగా.. ప్రత్యర్థులకు రెండు గోల్స్ ఇచ్చాయి. దీంతో ఈ రెండు టీమ్స్ ఆడే చివరి మ్యాచ్‌లే నాకౌట్‌కు ఎవరు వెళ్తాయన్నది డిసైడ్ చేయనున్నాయి.