మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. రత్నాల శాస్త్రం
Written By selvi
Last Updated : మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (17:25 IST)

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ''ఏడు'' అనే సంఖ్యకు సంబంధం వుందా?

శ్రీవారి వెంకన్న ఆలయం ఏడు ద్వారాలతో నిర్మితమైవుంది. వీటిని వైకుంఠ ద్వారాలుగా వ్యవహరిస్తారు. కులశేఖరపడి, రాములవారి మేడకు రెండు ద్వారాలు, జయ, విజయ, బంగారు, వెండి ప్రధాన ద్వారాలుగా ఇవి విభజితమై వున్నాయి.

శ్రీవారి వెంకన్న ఆలయం ఏడు ద్వారాలతో నిర్మితమైవుంది. వీటిని వైకుంఠ ద్వారాలుగా వ్యవహరిస్తారు. కులశేఖరపడి, రాములవారి మేడకు రెండు ద్వారాలు, జయ, విజయ, బంగారు, వెండి ప్రధాన ద్వారాలుగా ఇవి విభజితమై వున్నాయి. ఏడు అనే సంఖ్యతో శ్రీవారికి వీడని బంధం వుంది.


ఏడు కొండల స్వామి అనే పదం వృషాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వేంకటాద్రి, శేషాద్రి, గరుడాద్రి, తీర్థాద్రి అనే ఏడు కొండలకు ప్రతీక. 1958లో ఆరంభించిన అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమం ఇప్పటికీ ఆరుసార్లు పూర్తయింది. ఏడవ ద్వాదశవసంతంలో స్వామి అడుగులు వేశారు.
 
స్వామివారు దేవలోకం నుంచి భువికి వచ్చిన వెంటనే విశ్వరూపంలో కొలువుతీరారు. అప్పుడు ఏడుగురు మహర్షులు భువికి వచ్చి ప్రార్థనలతో స్వామిని స్తుతించి శాంతపరుస్తారు. ఆ ఏడుగురు ఎవరంటే..? భృగు, మరీచి, పులస్త్యుడు, పులహ, విశిష్ట, ఆత్రి, క్రతువులు. వీరు స్వామిని స్తుతించి.. విశ్వరూపం నుంచి సాధారణ రూపానికి వచ్చేలా చేశారు.
 
అలాగే శ్రీవారి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు కూడా ఏడు సంఖ్యతో అనుబంధం వుంది. అదెలాగంటే.. బ్రహ్మోత్సవంలో స్వామివారు 16 వాహనాల్లో ఊరేగుతారు. దీనిని కూడితే ఏడు వస్తుంది. ఆ వాహనాలు పెద్దశేష, చిన్నశేష, హంస, సింహ, ముత్యపు పందిరి, కల్పవృక్ష, సర్వభూపాల, దంతపల్లకి, గరుడ, స్వర్ణరథం, హనుమంత, గజ, సూర్యప్రభ, చంద్రప్రభ, రథ, అశ్వ వాహనములు 16గా పేర్కొన్నారు.
 
వాహనసేవలో ముందుభాగాన సప్తబలగాలు నడుస్తుంటే స్వామి తిరువీధి ఉత్సవం రమణీయంగా, వైదికంగా, అత్యంత శోభాయమానంగా జరుగుతుంది. అవి బ్రహ్మరథం, గజములు, అశ్వములు, వృషభములు, దివ్యప్రబంధగోష్ఠి, వేదపారాయణం, భక్తజనులు. 
 
అలాగే బ్రహ్మోత్సవంలో జరిగే వైదిక కార్యక్రమాలు కూడా ఏడే. అవి కోయిల్‌ ఆళ్వార్‌తిరుమంజనం, అంకురార్పణం, ధ్వజారోహణం, వాహనసేవలు, విశేషహోమాలు-కలశారాధన, స్నపనతిరుమంజనం, చక్రస్నానం అని.. స్వామి వారి గొప్పదనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు చెప్తున్నారు.