శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జనరల్ నాలెడ్జ్
Written By chj
Last Modified: గురువారం, 10 మార్చి 2016 (21:58 IST)

'మిస్టర్ వాట్సన్.. కమ్ హియర్, ఐ వాంట్ యూ'... మార్చి 10న తొలి ఫోన్ కాల్...

ఒక్కో రోజుకు ఒక్కో చరిత్ర ఉంటుంది. అలాగే మార్చి 10వ తేదీకి మరింత ప్రాముఖ్యత ఉంది. అదేమిటంటే... ఇదే తేదీన టెలిఫోన్ ద్వారా మాటలు ట్రాన్స్‌మిట్ చేయబడ్డాయి. మొదటి సంభాషణ ఏమిటంటే... టెలిఫోన్ కనుగొన్న అలెగ్జాండర్ గ్రాహంబెల్ ఫోనులో తన పక్క గదిలో ఉన్న సహాయకుడిని... " మిస్టర్ వాట్సన్, కమ్ హియర్, ఐ వాంట్ యూ" అనే మాటలు మాట్లాడారు. 
 
ఇక ఫోనును కనుగొన్న అలెగ్జాండర్ గ్రాహంబెల్ గురించి చూస్తే... ఆయన స్కాట్లాండులో 1847లో జన్మించారు. చిన్నతం నుంచే ప్రయోగాలంటే ఎంతో ఆసక్తిని కనబరిచే గ్రాహంబెల్ వాయిస్ టీచర్‌గా పనిచేసేవారు. ఆ సమయంలోనే ధ్వనిపైన ప్రయోగాలు మొదలుపెట్టారు. ఆ క్రమంలో ఆయన బధిరులకు పాఠాలు చెప్పేందుకు  1871లో బోస్టన్ వెళ్లారు. 1873 నాటికి బోస్టన్ యూనివర్శిటీలో వోకల్ సైకలాజీ ప్రొఫెసర్ అయ్యారు. 
 
కాస్త ఖాళీ దొరికితే చాలు... ధ్వని తరంగాల గమనం పైన ప్రయోగాలు చేస్తూ ఉండేవారు. అలా ఆయన ప్రయోగాలు చేస్తూ 1876 మార్చి 10న తొలిసారిగా ఫోనులో సంభాషించారు. అలా ఆయన కనుగొన్న ఫోన్... అనంతర కాలంలో అనేక పరిణామాలు చెందుతూ నేడు వైర్ లెస్ సెల్ ఫోన్ వరకూ వచ్చేసింది. కోట్ల మంది నేడు ప్రపంచంలో ఏ మూలనున్నా ఒకరికొకరు మాట్లాడుకునే వీలు కలుగుతోంది.