1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 3 జనవరి 2022 (22:00 IST)

కాలేయ వ్యాధికి దారితీసే కొవ్వు ఎలా చేరుతుందో తెలుసా?

బాగా ఎక్కువగా శుద్ధి చేసిన చక్కెర, అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ కాలేయ వ్యాధికి దారితీసే కొవ్వు పేరుకునేందుకు కారణమవుతుంది. అధిక బరువు లేకపోయినా, షుగర్ ఆల్కహాల్ మాదిరిగా కాలేయానికి హాని కలిగిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని రకాల కూల్ డ్రింక్స్, మిఠాయి వంటి చక్కెరలను జోడించిన ఆహారాన్ని పరిమితం చేయాల్సిన అవసరం ఇదే.

 
కాలేయాన్ని శుభ్రపరచాలంటే నిమ్మకాయ నీరు ఉదయాన్నే తీసుకుంటే ఫలితం వుంటుంది. నిమ్మరసం కాలేయాన్ని దానిలోని అన్ని టాక్సిన్స్‌ను బయటకు పంపేలా చేస్తుంది. మునుపెన్నడూ లేని విధంగా పునరుజ్జీవింపజేస్తుంది.

 
ఆపిల్, ద్రాక్ష, నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లను తింటుండాలి. ఇవి కాలేయానికి అనుకూలమైన పండ్లుగా నిరూపించబడ్డాయి. శరీరంలో యాంటీఆక్సిడెంట్ స్థాయిలను పెంచడానికి, కాలేయాన్ని టాక్సిన్స్ నుండి రక్షించడానికి ద్రాక్షరసం రూపంలో ద్రాక్షను అలాగే తినాలి. ద్రాక్ష గింజల పదార్థాలతో ఆహారాన్ని సప్లిమెంట్ చేస్తే మేలు కలుగుతుంది.