శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 30 డిశెంబరు 2021 (23:22 IST)

పెప్పర్ ఫార్ములా... ఇలా చేస్తే అధిక కొవ్వు ఔట్

మిరియాల పైపొరలో ఉండే ఫైటో న్యూట్రియంట్ సమ్మేళనాలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును విచ్ఛిన్నం చేసి అనవసరమైన కొవ్వు పేరుకోకుండా కాపాడతాయి. ఫలితంగా రక్తనాళాల్లో అధిక కొవ్వు వల్ల వచ్చే రక్తపోటు నుంచి ఉపశమనం పొందవచ్చు. 

 
బరువు పెరగకుండా కూడా చూసుకోవచ్చు. ఆందోళన, ఒత్తిడి నుండి బయటపడటానికి మిరియాలలో ఉండే పైపెరైన్ అనే గుణం తోడ్పడుతుంది. శీతాకాలంలో జలుబు, దగ్గుతో బాధపడేవారు పాలలో మిరియాల పొడి కలుపుకుని తాగాలి లేదా మిరియాల రసం తాగితే కూడా మంచిదే. 

 
50 గ్రాముల మిరియాల పొడిని 600 మిలీ నీళ్లలో చేర్చి అరగంట మరిగించాలి. ఆ నీటిని రోజుకు మూడుసార్లు తాగితే మంచిది. మిరియాల టీలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఈ విటమిన్ వైరస్, బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని రోగ నిరోధక వ్యవస్థకు చేరుస్తుంది. చిటికెడు మిరియాల పొడిని బాదంపప్పుతో కలిపి తీసుకుంటే కండరాలు, నరాల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.