శుక్రవారం, 24 ఏప్రియల్ 2026
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By chitra
Last Updated : గురువారం, 18 ఫిబ్రవరి 2016 (10:20 IST)

పుదీనా ఆకులతో మూర్ఛ వ్యక్తికి ఉపశమనం కలిగించవచ్చు.. ఎలా?

సాధారణంగా చాలా మంది మూర్ఛ రోగంతో బాధపడుతుంటారు. ఇలాంటివారు ఉన్నట్టుండి కిందపడిపోతారు. ఇలా మూర్ఛ వచ్చిన వారికి చిన్నపాటి చిట్కాలను పాటిస్తే మూర్ఛ నుంచి ఉపశమనం పొందవచ్చు. 
 
వ్యక్తి ఉన్నట్టుండి మూర్ఛపోతే పుదీనా ఆకులను నలిమి మూర్ఛపోయిన వ్యక్తికి వాసన చూపిస్తే మూర్ఛ దూరమై ఉపశమనం కలుగుతుంది. జలుబుచేత వచ్చిన జ్వరంతో బాధపడేవారికి పుదీనా, సొంఠి రసాన్ని కలిపి సేవిస్తే జ్వరం తగ్గిపోతుంది. 
 
అతిసార వ్యాధితో బాధపడుతుంటే పుదీనాను రుబ్బి తేనెతో కలిపి సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. ఆజీర్తితో బాధపడుతుంటే పుదీనా రసాన్ని సేవిస్తే జీర్ణం బాగా అయ్యి ఆకలి వేస్తుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.