1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 26 ఆగస్టు 2022 (23:06 IST)

కాలేయ వ్యాధి రావడానికి కారణాలు ఏమిటి?

liver
కుర్చీలకే గంటలకొద్దీ అతుక్కుపోయే జీవనశైలి, పెరిగిన మద్యపానం, ఊబకాయం భారతదేశాన్ని కాలేయ వ్యాధుల ప్రపంచ రాజధానిగా మార్చడానికి ప్రధాన కారణాలు. ఈ సమస్య నుంచి బయటపడటానికి, కొవ్వులు, మితమైన ఆల్కహాల్, ఎక్కువ ఫైబర్ తీసుకోవడం, ఆహారం కలుషితం కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అదనంగా, విష రసాయనాల నుండి చర్మాన్ని రక్షించడం, వ్యక్తిగత పరిశుభ్రతను నిర్వహించడం కూడా తప్పనిసరి.

 
సకాలంలో టీకాలు వేయించుకోవడం, తగినంత వ్యాయామం చేయడం వంటివి నివారణ చర్యలు. కాలేయ ఆరోగ్యాన్ని తనిఖీ చేయడంలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని భుజించాలి. వ్యాయామ నియమావళిని అనుసరించాలి.

 
ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. మరీ ముఖ్యంగా ఏదైనా కాలేయ వ్యాధి లక్షణాలు లేదా ప్రమాద కారకాలను గమనించినట్లయితే పరీక్షించండి. వ్యాధి వచ్చిన దాని కంటే నివారణ ఎల్లప్పుడూ ఉత్తమం. కనుక కాలేయం ఆరోగ్యానికి అవసరమైన మందుుల తీసుకుంటుండాలి.