గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 17 ఆగస్టు 2022 (11:11 IST)

కోవిడ్ 19కి బీసీజీ టీకాతో చెక్, దీర్ఘకాల రక్షణకు క్షయ వ్యాధి నివారణ టీకా

Covid test
కోవిడ్ 19 ప్రపంచాన్ని ఎంత అతలాకుతలం చేసిందో తెలిసిందే. లక్షల మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కాగా డయాబెటిస్, బీపీ రోగులకు కోవిడ్ వస్తే ఇక వారి ప్రాణాలు గాలిలో దీపాలే అని వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే.

 
ఈ నేపథ్యంలో టైప్ 1 డయాబెటిస్ రోగుల్లో కోవిడ్ నిర్మూలనకు బీసీజీ టీకా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు అమెరికన్ పరిశోధకులు కనుగొన్నారు. క్షయవ్యాధి నివారణకు ఉపయోగించే బీసీజీ టీకా వేయడం వల్ల కోవిడ్ 19 నుంచి రక్షణ లభిస్తున్నట్లు కనుగొన్నారు.

 
కోవిడ్ వైరస్ తో పాటు ఇతర రకాల వ్యాధులు కూడా దరిచేరడంలేదని తేలింది. అధ్యయనంలో భాగంగా 144 మంది టైప్ 1 మధుమేహ వ్యాధిగ్రస్తులపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. బీసీజీ టీకా 92 శాతం సామార్థ్యాన్ని చూపించినట్లు పరిశోధకులు వెల్లడించారు.