శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 18 మే 2022 (21:00 IST)

ఊపిరి తీసుకోవడంలో సమస్యలు ఎందుకు వస్తాయి?

lungs
ఊపిరి పీల్చుకున్నప్పుడు, శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌ను తీసుకోవడం కష్టంగా లేదా అసౌకర్యంగా ఉంటుంటే అది శ్వాస సంబంధిత సమస్యకు కారణం అయి వుండవచ్చు. తగినంత గాలి అందడం లేదని అనిపించవచ్చు. 

 
కొన్నిసార్లు ముక్కుదిబ్బడ లేదా తీవ్రమైన వ్యాయామం కారణంగా తేలికపాటి శ్వాస సమస్యలను కలిగి ఉండవచ్చు. కానీ శ్వాస ఆడకపోవడం కూడా తీవ్రమైన వ్యాధికి సంకేతం అని వైద్య నిపుణులు చెపుతున్నారు.

 
అనేక పరిస్థితులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తాయి, అవేంటో చూద్దాం. ఆస్తమా, ఎంఫిసెమా లేదా న్యుమోనియా వంటి ఊపిరితిత్తుల పరిస్థితులు. వాయుమార్గ వ్యవస్థలో భాగమైన శ్వాసనాళం లేదా శ్వాసనాళంతో సమస్యలు.
 
శరీరానికి ఆక్సిజన్ సరఫరా చేయడానికి గుండె తగినంత రక్తాన్ని పంప్ చేయలేకపోతే ఇలాంటి సమస్య తలెత్తవచ్చు. గుండె జబ్బులు ఊపిరి తీసుకోవడంలో సమస్యకు కారణం కావచ్చు. ఆందోళన, తీవ్ర భయాందోళనలు కలిగినప్పుడు కూడా ఊపిరి ఆడకుండా ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశం వుంటుంది. ఇక చివరగా అలర్జీలు కూడా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులను కలిగించవచ్చు.