సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 16 నవంబరు 2023 (23:10 IST)

అల్లం ఎందుకు తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

Ginger
అల్లం ఎన్నో అనారోగ్య సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. అల్లం జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేయడానికి, కడుపుని మరింత త్వరగా ఖాళీ చేయడానికి సహాయపడుతుంది. అల్లంతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. అజీర్ణం, అల్సర్లు, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలతో సతమతమయ్యేవారికి అల్లం మేలు చేస్తుంది. స్త్రీ రుతుక్రమంలో నొప్పి తగ్గేందుకు మొదటి మూడు రోజులు అల్లం తీసుకోవడం ద్వారా సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.
 
అల్లంలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనం, దాని యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్ లక్షణాలతో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అల్లం దగ్గును నిరోధిస్తుంది, ఇన్ఫెక్షన్‌లతో పోరాడుతుంది, తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. అల్లంలో వుండే జింజెరాల్‌లోని కొన్ని ప్రయోజనాలు కొన్ని రకాల క్యాన్సర్‌లను నివారిస్తాయని తేలింది.
 
అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్లనొప్పులతో వచ్చే నొప్పిని తగ్గించి, కీళ్ల కదలికను పెంచుతాయి. అల్లం రక్తాన్ని పలుచగా చేస్తుంది కనుక ఇది హృదయ సంబంధ సమస్యలను నివారించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. అల్లం గుండెపోటు, స్ట్రోక్‌ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సాయపడుతుంది.