డయాబెటిస్, ఈ 8 లక్షణాలు కనబడితే అనుమానించాలి
డయాబెటిస్. ఈ వ్యాధి చాప కింద నీరులా ప్రవేశిస్తుంది. అసలు ఈ వ్యాధి వచ్చిన సంగతి కూడా చాలామందికి తెలియదు. అందుకే ఆ వ్యాధి లక్షణాలు ఎలా వుంటాయో తెలుసుకుందాము.
తరచుగా రాత్రిపూట ఎక్కువగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.
చాలా దాహం వేస్తుంది, నోరు తడారి పోతుంటుంది.
ప్రయత్నించకుండానే బరువు తగ్గిపోతుంటారు.
ఎంత తిన్నా మళ్లీ బాగా ఆకలి వేస్తుంటుంది.
అస్పష్టమైన కంటి దృష్టిని కలిగి వుంటారు.
చేతులు లేదా కాళ్ళు తిమ్మిరి లేదా జలదరింపు వుంటుంది.
చాలా అలసటగా అనిపిస్తుంది.
చాలా పొడి చర్మం కలిగి ఉంటారు.