బుధవారం, 27 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 27 జులై 2016 (11:52 IST)

ఏసీ కింద కూర్చుని పనిచేస్తున్నారా? గంటకోసారి అర గ్లాసు నీరైనా తాగండి!

డైటింగ్ పేరుతో తిండికి కోత వేస్తే ఆరోగ్యానికి నష్టమే అంటున్నారు పోషకాహార నిపుణులు. డైటింగ్ చేసేవారు ఎత్తును బట్టి రోజుకు 1350 నుంచి 1500 క్యాలరీలకు తగ్గకుండా ఆహారం తీసుకోవాలంటున్నారు. రోజువారీ ఆహారంలో

డైటింగ్ పేరుతో తిండికి కోత వేస్తే ఆరోగ్యానికి నష్టమే అంటున్నారు పోషకాహార నిపుణులు. డైటింగ్ చేసేవారు ఎత్తును బట్టి రోజుకు 1350 నుంచి 1500 క్యాలరీలకు తగ్గకుండా ఆహారం తీసుకోవాలంటున్నారు. రోజువారీ ఆహారంలో చేపలు, గ్రీన్ టీ, పచ్చిమిర్చి, బాదం, యాపిల్స్, సోయాబీన్, పుచ్చకాయ వంటివి తప్పకుండా చేర్చుకోవాలి. ఇక నీరు తప్పకుండా తీసుకోవాలి. ఏసీ కింద కూర్చుని పనిచేస్తున్నా.. గంటకోసారి అర గ్లాసుడు నీరైనా సేవించాలి. 
 
ఇలా రోజుకు 3-4 లీటర్ల వరకు నీటిని తాగితే మంచిది. నీరు తాగిన పది నిమిషాల్లోనే మెటబాలిజం 30 శాతం పెరిగి 30 నిమిషాలకు స్పీడు అందుకుంటుంది. అందుచేత నీటిని వీలైనన్ని ఎక్కువగా తీసుకోవాలి. ఇక శరీరం రోజంతా సమర్థవంతంగా పనిచేసేందుకు నిద్ర సహకరిస్తుంది. నిద్రలేమి మెటబాలిజంను కుంటుపరుస్తుంది. దాంతో తక్కువ శక్తి ఖర్చవటంతోపాటు ఆకలి పెరుగుతుంది. కాబట్టి మెటబాలిజం స్పీడవ్వాలంటే కంటినిండా నిద్ర పోవాలి. 
 
ఈ మెటబాలిజం అనేది మనం తీసుకునే ఆహారం శక్తిగా మారి ఖర్చయ్యే విధానమే. ఇది పెరిగావచ్చు. తగ్గావచ్చు. తగ్గితే శక్తి కొవ్వుగా పేరుకుపోతుంది. కాబట్టి మెటబాలిజంను నీరసించి పోకుండా పరుగులు పెట్టించాలంటే డార్క్ చాక్లెట్, అవకాడో, ఆలివ్ ఆయిల్, పీనట్ బటర్‌, వాల్‌నట్స్‌, ఫ్లాక్స్‌ సీడ్‌, చేపలు, సోయాబీన్స్‌ వంటివి తీసుకోవాలి. రోజుకి మూడు సార్లు కాకుండా ప్రతి మూడు గంటలకు కొద్ది పరిమాణంలో ఆహారం తీసుకోవాలి. ఇలా అలవాటు చేసుకుంటే గంటలపాటు కొవ్వు కరుగుతూ ఉంటుంది.