మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 మే 2020 (13:33 IST)

అద్భుత ప్రయోజనాలిచ్చే అరటి ఆకు.. (video)

అరటి ఆకు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. రోజూ అరటి ఆకులో భోజనం చేయడం ద్వారా రక్తంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. శరీరంలో రక్తం శుద్ధి అవుతుంది. రోజూ అరటి ఆకులో భోజనం చేయడం ద్వారా జీర్ణమండలం ఆరోగ్యకరంగా వుంటుంది. అజీర్తి సమస్యలుండవు. ఆయుర్వేదం ప్రకారం వాత, పిత్త, కఫ రోగాలను మటుమాయం చేసే గుణాలు అరటి ఆకులో వున్నాయి. 
 
అలాగే అరటి ఆకు భోజనంతో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా శరీరం పూర్తి ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది. అల్సర్, కడుపులో మంట వంటి రుగ్మతలను అరటి ఆకులో భోజనం చేయడం ద్వారా దూరం చేసుకోవచ్చు. అరటి ఆకులో ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా వుండటంతో అరటి ఆకు భోజనం ద్వారా క్యాన్సర్ కారకాలను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.