శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 7 జనవరి 2017 (17:10 IST)

బీట్ రూట్ రసాన్ని వారానికి ఓసారైనా తాగండి.. చర్మ సమస్యలను దూరం చేసుకోండి.

బీట్‌ రూట్‌ను వారానికి ఓసారి ఉపయోగించడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బీట్ రూట్ జ్యూస్‌లో ఉండే బీటైన్ కంటెంట్ హెల్తీ లివర్ ఫంక్షన్‌కు సహాయపడుతుంది. ఇంకా బీట్

బీట్‌ రూట్‌ను వారానికి ఓసారి ఉపయోగించడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బీట్ రూట్ జ్యూస్‌లో ఉండే బీటైన్ కంటెంట్ హెల్తీ లివర్ ఫంక్షన్‌కు సహాయపడుతుంది. ఇంకా బీట్ రూట్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. తద్వారా శరీరంలో కొత్త రక్తకణాల ఏర్పాటు సాధ్యమవుతుంది.
 
బీట్ రూట్ జ్యూస్‌లో యాంటీట్యూమర్ ఎఫెక్ట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మన శరీరంలోని సెల్స్‌కు రక్షణ కల్పిస్తాయి. కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతాయి. బీట్ రూట్ జ్యూస్‌ను వారానికోసారి తీసుకుంటే బీపీ తగ్గుతుంది. బీట్ రూట్‌లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల వ్యాధినిరోధకతను పెంచడంతో పాటు, నొప్పులను, వాపులను తగ్గిస్తుంది.
 
బీట్ రూట్ జ్యూస్‌ను రెగ్యులర్ డైట్‌‌లో చేర్చుకోవడం వల్ల యాంటీ ఏజింగ్ లక్షణాలు కనిపించవు. ఎందుకంటే ఇందులో ఉండే ఫొల్లెట్, ముఖంలో ముడతలు, ఇతర చర్మ సమస్యలతో పోరాడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.