శనివారం, 14 సెప్టెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 2 ఆగస్టు 2024 (22:36 IST)

బీట్ రూట్ రసం తాగితే ప్రయోజనాలు ఏమిటి?

దుంపకూరల్లో బీట్ రూట్ ప్రత్యేకమైనది. ఎందుకంటే బీట్ రూట్ జ్యూస్ అధిక రక్తపోటును బాగా తగ్గిస్తుందని చెపుతారు. ఈ బీట్ రూట్ జ్యూస్ తాగుతుంటే కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము.
 
బీట్ రూట్ జ్యూస్‌ రక్తపోటు తగ్గేందుకు సాయపడి గుండె ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడుతుంది.
బీట్‌రూట్‌కు ఎరుపు రంగుని కలిగించే బీటాసైయానిన్‌కు పేద్దపేగుల్లో క్యాన్సర్‌తో పోరాడే లక్షణం ఉంది. 
బీట్‌రూట్‌లోని నైట్రేట్‌ ఆక్సైడ్‌లు రక్తప్రసరణ వేగాన్ని పెంచడంతో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి.
సౌందర్యానికి విటమిన్‌ బి ఎక్కువగా ఉండే బీట్‌రూట్‌ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది.
నాడుల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్‌ తోడ్పడుతుంది.
హైబీపీ వున్నవారికి బీట్ రూట్ మంచిదే అయినప్పటికీ అధిక రక్తపోటుకు మందులు వాడే వారు బీట్ రూట్‌ను తక్కువగా తీసుకోవాలి.
ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది.