శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 24 జూన్ 2019 (16:37 IST)

ధనియాల కషాయం తాగడం వల్ల ఏంటి ప్రయోజనం?

ధనియాలను మనం వంట చేసే సమయంలో కూరలో వేయడానికి ఉపయోగిస్తుంటాము. వీటిని సాధారణంగా వంట రుచి పెంచడానికి ఉపయోగిస్తుంటారు. కానీ వీటిని వాడటం వల్ల ఏన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
 
ధనియాలను తీసుకోవడం వల్ల అజీర్తి సమస్యలు దూరమవుతాయట. ధనియాలను తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఫలితంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతుంది. 
 
ధనియాల కషాయం రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు పూర్తిగా కరిగిపోతుంది. ఫలితంగా హృదయ సంబంధ వ్యాధులు దూరమవుతాయి. ఈ కషాయం మహిళల్లో వచ్చే బుతుసమస్యలను దూరం చేస్తుంది.