1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: శనివారం, 22 సెప్టెంబరు 2018 (19:19 IST)

పరగడుపునే అర లీటరు మంచినీళ్లు తాగితే ఏం జరుగుతుంది?

పరగడుపున మంచినీరు తాగటం వలన అసాధారణమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో అనారోగ్య సమస్యలకు నివారిణిగా పనిచేస్తుంది. దీనిని వైద్యశాస్త్రం కూడా ధ్రువీకరించింది. ప్రతివారూ నిద్ర లేవగానే ఒకటిన్నర లీటరు మంచి నీటిని తాగాలి. తర్వాత గంట వరకు ఎలాంటి ఆహారం తీసు

పరగడుపున మంచినీరు తాగటం వలన అసాధారణమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో అనారోగ్య సమస్యలకు నివారిణిగా పనిచేస్తుంది. దీనిని వైద్యశాస్త్రం కూడా ధ్రువీకరించింది. ప్రతివారూ నిద్ర లేవగానే ఒకటిన్నర లీటరు మంచి నీటిని తాగాలి. తర్వాత గంట వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
 
1. పరగడుపున ఖాళీ కడుపుతో మంచినీళ్లు తాగడం వలన పెద్దపేగు శుభ్రపడి మరిన్ని పోషకాలను గ్రహిస్తుంది.
 
2. కొత్త రక్తం తయారీని, కండర కణాల వృద్ధిని పెంచుతుంది.
 
3. ఉదయాన్నే కనీసం అరలీటరు నీటిని తాగడం వలన 24 శాతం శరీర మెటబాలిజాన్ని పెంచుతుంది. తద్వారా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
 
4. రక్త కణాలను శుద్ధి చేయడం వలన శరీరంలోని మలినాలు తొలగుతాయి. దానితో శరీర ఛాయ మెరుగుపడుతుంది. శ్వేత ధాతువులను  సమతుల్యం చేస్తుంది. ఈ గ్రంధుల వలన రోజువారీ కార్యక్రమాలలో ఎలాంటి ఆటంకం లేకుండా శరీరం ద్రవ పదార్ధాన్ని కోల్పోకుండా, ఇన్ఫెక్షన్ దరిచేరకుండా పోరాడుతుంది.