శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (14:31 IST)

మొలకెత్తిన ధాన్యాలతో ఆరోగ్యం.. ఉలవలు, మినుములు అంత మేలు చేస్తాయా?

Sprouts
మొలకెత్తిన ధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి కావలసిన పోషకాలను ఇవి అందిస్తాయి. ఇందులోని యాంటీ-యాక్సిడెంట్లు అనారోగ్యాల నుంచి తప్పిస్తాయి. ధాన్యాలు, పప్పు దినుసులు మనం తినడం ద్వారా పోషకాలు పూర్తిస్థాయిలో లభిస్తాయి. ఉడికించి తీసుకునే పదార్థాలతో పోషకాలు నశిస్తాయి. ఈ మొలకెత్తిన ధాన్యాల ద్వారా పోషకాలు అందుతాయి. 
 
మొలకెత్తిన ధాన్యాల్లో విటమిన్ సి, ప్రోటీన్లు, నియాసిన్, పొటాషియం, ఇనుము వంటివి వున్నాయి. మొలకెత్తిన మెంతుల్ని తీసుకుంటే.. ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్థులు మొలకెత్తిన ధాన్యాలను తీసుకోవాలి. ఇంకా మొలకెత్తిన ఉలవలు తీసుకుంటే.. కొలెస్ట్రాల్ మాయం అవుతుంది. బొజ్జ తగ్గుతుంది. ఒబిసిటీ పరారవుతుంది. నరాలు, ఎముకలకు బలాన్నిస్తుంది. 
 
కీళ్ల నొప్పులతో బాధపడేవారు మొలకెత్తిన ఉలవలను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చుతుంది. మొలకెత్తిన పెసళ్లు కూడా మోకాలి నొప్పులకు దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఇంకా మధుమేహ వ్యాధిగ్రస్థులు, బాలింతలు మొలకెత్తిన మినుములు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.